Minister V Srihari | తెలంగాణ మంత్రిగా తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని మంత్రి వాకిటి శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా అదృష్టమో లేక దురదృష్టమో తెలియడం లేదని..పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆగమైన శాఖలను నాకు కేటాయించారు. యువజన సర్వీస్ లు ఇస్తే నేనేం చేయాలి..గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?’అని అన్నారు. తనకు కేటాయించిన శాఖలపై వేదికపై ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పానన్నారు. పశుసంవర్ధక శాఖతో పాటు తనకు కేటాయించిన 5 శాఖలు ఆగమాగం ఉన్నాయన్నారు.
అవినీతి, అక్రమాలు జరిగిన మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖలు తనకుఇచ్చారని.. ఇప్పుడు ఆ కిరికిరి కడగాల్నా..లేకుంటే కొత్తగా పనిచేయాల్నా అర్ధం కావడం లేదన్నారు. యువజన సర్వీసులు ఇస్తే తాను ఎట్లా ఉద్యోగ, ఉపాధి కల్పన చేయాలని ప్రశ్నించారు. కరీంనగర్‌లో క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. కబడ్డీ, హ్యాండ్ బాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రీడా పాఠశాలల అంతర్గత పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు.