విధాత, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పరిపాలనలో సాంకేతికతను మరింత పెంచడానికి, ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో పారదర్శకత, వేగాన్ని పెంచడానికి ఉద్యగులందరికి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి చేసింది. దీనికోసం ప్రభుత్వ శాఖల్లోని కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష పెట్టనుంది. ఈ పరీక్షలో ఉద్యోగులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు జీఓ నెం.237ను ప్రభుత్వం జారీ చేసింది.
కొత్త జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు అందర కంప్యూటర పరీక్షకు హాజరవడమే కాకుండా.. అందులో ఖచ్చితంగా ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. అలాగే, ఉత్తీర్ణతతో పాటు, ఆఫీసు ఆటోమేషన్ యంత్రాల నిర్వహణలో కూడ ప్రావీణ్యం తప్పనిసరిగా చేసింది. ఒకవేళ కంప్యూటర్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించకపోతే వాళ్లను ప్రభుత్వం ఇంటికి పంపనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియ్ స్టెనోగ్రాఫర్లు, యూ.డీ టైపిస్టులు, ఎల్ డీ టైపిస్టులు, టైపిస్టులు మొదలైన కేటగిరీల వారికి ఇది వర్తిస్తుందని జీవో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కొందరు కారుణ్య నియామకాల వంటి వివిధ కారణాలతో ఈ ఉద్యోగాలకు ఎన్నికయిన వారున్నారు. ఇకపై వారంతా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్ తీసకోచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
