విధాత, హైదరాబాద్: తెలంగాణాలో పదో తరగతి ఫలితాలను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లుగా విద్యాశాఖ ప్రకటించింది. 30వ తేదీన ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ పదవ తరగతి ఫలితాల ప్రకటనకు సిద్ధం కావడంతో పరీక్షలు రాసిన సుమారు 5 లక్షల మంది పదవ తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగగా.. ఏప్రిల్ 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ను ప్రారంభించారు.19 కేంద్రాల్లో ఈ నెల 13 వరకు స్పాట్ వాల్యూయేషన్ జరిగింది. ఈ నెల 30వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 30న పదవ తరగతి ఫలితాలు
