TS Inter Results | నేడే తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల

TS Inter Results | ఇవాళ ( బుధవారం) తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను విడుదల చేస్తారు.

  • Publish Date - April 24, 2024 / 06:10 AM IST

TS Inter Results : ఇవాళ ( బుధవారం) తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను విడుదల చేస్తారు.

తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ ను సందర్శించాలని అధికారులు సూచించారు. ఈ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి క్షణాల్లో ఫలితాలను తెలుసుకోవచ్చని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్‌ కాపీని ప్రింట్‌ తీసుకోవచ్చని తెలిపారు.

నేడు ఫలితాలు వెల్లడికానుండటంతో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులలో టెన్షన్‌ నెలకొన్నది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తామా.. లేదా..? అనే ఆందోళన కొందరిది కాగా, పరీక్షలో అనుకున్నన్ని మార్కులు వస్తాయా.. రావా..? అనే టెన్షన్‌ కొందరిది. లక్షలు ఫీజులు కట్టి చదివిస్తున్నాం ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ తల్లిదండ్రులది. ఈ అందరి ఉత్కంఠకు ఇంటర్మీడియట్‌ బోర్డు మరికొన్ని గంటల్లో తెరదించనుంది.

 

Latest News