Site icon vidhaatha

Malla Reddy Agriculture University | మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. ఫర్నిఛర్ ధ్వంసం

విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలోని తరగతి గదిలో నల్లగొండ జిల్లా కనగల్‌కు చెందిన విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద నిరసనకు దిగాయి. తరగతులను బహిష్కరించి విద్యార్థులు సైతం కాలేజీ వద్ద బైఠాయించారు. మరోవైపు మృతుడి బంధువులు కళాశాలలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.

ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్ పోలీసులు అందోళనకారులను అడ్డుకున్నారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని, విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు పూర్తి విచారణ చేపట్టాలని వారు కోరారు. కాగా, బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చుదువుతున్న అరుణ్ కుమార్ శుక్రవారం తరగతి గదిలో స్పృహ తప్పి పడిపోయడని, ఆస్పత్రికి తరలించేసరికే మృతి చెందినట్లు విద్యార్థలు తెలిపారు. అంబులెన్స్ ఆలస్యమవడం వల్లనే చనిపోయాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు

Exit mobile version