Site icon vidhaatha

TG Rains | తెలంగాణలో నాలుగు రోజులు వానలు.. ఎల్లో హెచ్చరిక జారీ చేసిన వాతావరణశాఖ

TG Rains | నేటి నుంచి నాలుగురోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పింది.

ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమవారం యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుపడుతాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Exit mobile version