TGPSC Group-1 Mains | గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 21 నుంచి మెయిన్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 21 నుంచి 27 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్‌పీఎస్సీ అందుబాటులోకి తీసుకువచ్చింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లతో పాటు జనరల్ ఇంగ్లీషు పేపర్ రాయాల్సి ఉండనున్నది. ప్రతి పేపర్ 150 మార్కులకు 3 గంటల సమయం ఉంటుంది. రోజూ మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష కొనసాగనున్నది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న జరిగింది. 3.02 లక్షలమంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో ఇందులో 31, 382 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను సైతం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించొద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులకు అవగాహన కోసం వెబ్‌సైట్‌లో మోడల్ ఆన్సర్ బుక్‌లెట్స్‌ను సైతం అందుబాటులో ఉంచింది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదీ
21న జనరల్ ఇంగ్లీషు పరీక్ష ( అర్హత పరీక్ష)
22న పేపర్ 1 జనరల్ ఎస్సే
23న పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ
24న పేపర్ 3 ఇండియన్ సొసైటీ, భారత రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్
25న పేపర్ 4 ఎకానమీ
26 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ
27 పేపర్ 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం