Site icon vidhaatha

Group 1 Mains Exam| గ్రూప్- 1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

విధాత, హైదరాబాద్ : గ్రూప్- 1 మెయిన్స్(Group 1 Mains Exam)పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు(Verdict) వెలువరించింది.గ్రూప్-1 మెయిన్స్ జవాబు పాత్రలను రీవాల్యుయేషన్ (Revaluation)చేయాలని కోర్టు ఆదేశించింది. 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ప్రక్రియపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైతే గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ(Re-exam) నిర్వహించాలన్న కోర్టు టీజీపీఎస్సీని అదేశించింది. మెయిన్స్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు(Merit List Cancelled) చేసింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై అన్ని వైపుల వాదనలు విన్న హైకోర్టు రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని..అప్పుడు కూడా అభ్యంతరాలు తలెత్తితే మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ ఏ రకంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. సింగిల్ బెంచ్ నిర్ణయంపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు అప్పిల్ చేస్తుందా లేక సింగిల్ బెంచ్ తీర్పు మేరకు రీవాల్యుయేషన్ నిర్వహిస్తుందా..లేక మళ్లీ పరీక్షలు నిర్వహిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

 

 

 

Exit mobile version