హైదరాబాద్ : టీజీఎస్ఆర్టీసీ టోల్ సెస్ పేరుతో ప్రయాణికులపై మరో భారం వేసేందుకు సిద్ధమైంది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ టోల్ ఫీజు వర్తించనుంది. పెంచిన టోల్ ఫీజును ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేయనున్నారు. టోల్ బాదుడు జూన్ 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రయాణికులకు భారం కానుంది.
ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో టోల్ ఛార్జీ కింద రూ. 10 వసూలు చేస్తున్నారు. జూన్ 1 నుంచి రూ. 13 వసూలు చేయనున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ. 13 నుంచి రూ. 16కు, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 14 నుంచి రూ. 17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సుల్లో రూ. 15 నుంచి రూ. 18, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 నుంచి రూ. 23కు పెంచారు.