School Buses | రోడ్లపై అనేక రకాల వాహనాలు( Vehicles ) కనిపిస్తుంటాయి. ఇక ప్రధానంగా ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు( RTC Buses ) అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు ఆకుపచ్చ, ఆరెంజ్, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. మరి స్కూల్( School Buses ), కాలేజీ బస్సులు( College Buses ) మాత్రం కేవలం ఒకే రంగును కలిగి ఉంటాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా.. స్కూల్, కాలేజీ బస్సులన్ని పసుపు రంగు( Yellow Colour )లోనే ఉంటాయి. అసలు స్కూల్, కాలేజీ బస్సులు పసుపు రంగులోనే ఉండాలన్న ఆలోచన ఎలా వచ్చింది..? దాని వెనుకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
హౌ స్టఫ్ వర్క్స్( How Stuff Works ) వెబ్‌సైట్ కథనం ప్రకారం.. స్కూల్, కాలేజీ బస్సులు పసుపు రంగులోనే ఉండాలన్న ఆలోచన అమెరికా( America )లోనే పురుడు పోసుకుంది. ఎలాగంటే.. 1930లలో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాంక్ కైర్.. స్కూల్ వాహనాలపై సమగ్ర పరిశోధనలు చేశారు. బస్సుల డిజైన్ ఎలా ఉండాలి..? ఏ రంగులో ఈ బస్సులు ఉంటే బెటర్..? మిగతా బస్సుల కంటే స్కూల్, కాలేజీ బస్సులు విభిన్నంగా ఉండాలి అని సహోద్యోగులు, టీచర్లు, రవాణా శాఖ అధికారులు, బస్సుల తయారీదారులతో ప్రత్యేక చర్చలు జరిపారు. వీరంతా కలిసి ఏకగ్రీవంగా ఎల్లో, ఆరెంజ్ రంగును ఎంచుకున్నారు. కానీ మెజార్టీ ఎల్లో రంగుకే వచ్చింది. దీంతో స్కూల్, కాలేజీ బస్సులు పసుపు రంగులో ఉండాలని నిర్ణయించారు. నాటి నుంచి నేటి వరకు ఆ బస్సులన్నీ ఎల్లో రంగులోనే ఉంటున్నాయి.
ఎల్లో రంగే ఎందుకంటే..?
పసుపు రంగును మనషులు ఈజీగా గుర్తించగలుగుతారు. ఇంకో కారణం ఏంటంటే.. సాధ్యమైనంత ఎక్కువ దృశ్యమానతను కలిగి ఉంటుంది ఎల్లో కలర్. సాధారణంగా ప్రతీ రంగుకు ఒక స్థిరమైన తరంగ ధైర్ఘ్యం ఉంటుంది. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగుల్లో ఉంటుంది. కాంతి తరంగ దైర్ఘ్యం, పరావర్తనం (రిఫ్లెక్షన్)లపైనే రంగులు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే పసుపు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కారణంగానే పసుపు రంగు స్పష్టంగా కనిస్తుంది. మిగిలిన అన్ని రంగులతో పోల్చితే పసుపు రంగు 1.24 రెట్లు వేగంగా మన కంటిని ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే స్కూలు బస్సులకు పసుపు రంగు వేయాలని నిర్ణయించారు స్కూల్, కాలేజీ బస్సులను ఇతర వాహనదారులు సులభంగా గుర్తించి అలర్ట్ కావడానికే ఇలా చేస్తారు.