Site icon vidhaatha

TELANGANA | తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలి .. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక డిమాండ్

విధాత, వరంగల్ ప్రతినిధి:ఆత్మ బలిదానాలతో ఆనాటి ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొని ప్రత్యేక రాష్టాన్ని సాధిస్తే… చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లుగా నియంత కేసీఅర్ కుటుంబ పాలనగా మార్చారని ముఖ్య అతిథి, తొలితరం ఉద్యమకారుడు డాక్టర్ అనీక్ సిద్ధిఖీ ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్లో ఆదివారం ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్ధిక్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధన కోసం కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు, మేధావులు, సబ్బండ వర్గాలు క్రియాశీలకంగా పాల్గొని ఉద్యమాన్ని నిర్మించారని అన్నారు. నూతన తెలంగాణ రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారిని రాష్టం కోసం నిజాయితీగా పోరాటం చేసిన కళాకారులను, కార్మికులను ఉద్యోగులను పాతాళ లోకంలోకి తొక్కారన్నారు. ఉద్యమంతో సంబంధం లేకుండా, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పక్కన చేర్చుకున్నారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, నాకు ఎదురులేదని విర్రవీగి కుటుంబ పాలన చేసిన నియంత కే సీ ఆర్ ను తెలంగాణ సబ్బండ వర్గాలు గద్దె దింపారని అన్నారు.

రాష్ట్ర కో ఆర్డినేటర్ కన్వీనర్ గోధుమల కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులతో కమిటీ వేసి సంక్షేమం ప్రకటించడానికి చొరువ చూపాలని అన్నారు. ఈ సమావేశములో గ్రేటర్ వరంగల్ కమిటీ వేశారు. గౌరవ అధ్యక్షుడిగా మమ్మద్ నయీమ్, అధ్యక్షులు గా డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్ , ప్రధాన కార్యదర్శిగా మీర్జా అంజద్, గోపన బోయిన రాజు, దుర్గాదాస్, నవరత్న ఆనంద్, నాగపూరి శ్రీనివాస్, ధర్మపురి రామారావు, తెలంగాణ కొమురయ్య, ఐతం నగేష్. చెరుకు ప్రవీణ్ కుమార్, ప్రకాష్, సుధాకర్, పోలేపాక సతీశ్ లున్నారు.
*

Exit mobile version