Site icon vidhaatha

గన్ మిస్‌ఫైర్.. ఫ్లాట్‌లోకి దూసుకొచ్చిన బుల్లెట్

విధాత, హైదరాబాద్ : గన్ మిస్‌ఫైర్ కావడంతో నివాసిత ఫ్లాట్‌లోకి బుల్లెట్ దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. నార్సింగి బైరాగిగూడలోని ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోని ప్లాట్‌లోకి అకస్మాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. బుల్లెట్ దెబ్బకు ఫ్లాట్ అద్దం పగిలిపోగా బుల్లెట్ ఫ్లాట్‌లోపలికి చొచ్చుకవచ్చి పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. ఫ్లాట్‌లో బుల్లెట్ పడివుండటంపై ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపగా దగ్గర్లో ఫైరింగ్ ప్రాక్టీస్ జవాన్ల గన్ మిస్ ఫైర్ అయి అపార్ట్‌మెంట్‌లోకి బుల్లెట్ దూసుకొచ్చిందని తేలింది.

Exit mobile version