Site icon vidhaatha

Hyderabad Metro Railway | నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్వేసంస్థ నష్టాలను తగ్గించుకుని, ఆదాయాన్ని పెంచుకునే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తూ(Abolishing free parking at Nagole Metro Station) నిర్ణయిం తీసుకుంది. నగరంలోని మెట్రో స్టేషన్‌లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్‌ఆండ్‌టీ సంస్థ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్(Paid parking from August 25) అమలు చేయనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ ఫీజు (Parking Fee at Miyapur Metro Station from September 1)వసూలు చేయనున్నట్లు తెలిపింది. పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాల కోసమే ఈ విధానం తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కొత్తగా పార్కింగ్ ధరలను ప్రకటించింది. బైక్‌లకు కనీసం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.20 చెల్లించాలి. 8 గంటల వరకు రూ.25 చెల్లించాలి. 12 గంటల వరకు రూ.40 చెల్లించాలని తెలిపింది. అదనంగా ప్రతి గంటకు రూ.5 చెల్లించాలి. అలాగే కార్లకు కనీసం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలని, 8 గంటల వరకు రూ.75 చెల్లించాలని, 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.15 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి ముఖ్యంగా ఉద్యోగస్తుల నుంచి తీవ్ర నిరసన వినిపిస్తుంది. స్టేషన్ వరకు వచ్చి తమ వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేసుకుని హైటెక్ సిటీ సహా మియాపూర్ వంటి ప్రాంతాల(Areas like Miyapur including hi-tech city) వరకు వెళ్లి ఉద్యోగాలు చేసి తిరిగి ఇళ్లకు చేరుకునే వారమని, ఇప్పుడు ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ధరలు నిర్ణయించడం తమపై ఆర్థికంగా పెనుభారం కానుందని ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు .

నాగోలులో మెట్రో ప్రయాణికుల ఆందోళన

పెయిడ్ పార్కింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నాగోలు స్టేషన్‌లో బుధవారం అమలు చేశారు(It was executed on Wednesday at Nagolu station). నిన్నటి వరకు ఫ్రీ పార్కింగ్ ఉన్న చోట ఆకస్మాత్తుగా పెయిడ్ పార్కింగ్ అని చెప్పడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పార్కింగ్ ఫీజు ఎక్కువగా ఉందని మండిపడుతున్నారు.

Exit mobile version