Site icon vidhaatha

Mahabubabad | చావును ఊహించి.. సోదరులకు రాఖీ కట్టి కన్నుమూత.. రాఖీ పౌర్ణమి వేళ వైరల్‌గా మారిన వీడియో

Mahabubabad | ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ పొంచి వున్న చావును ముందే గ్రహించిందేమోగాని ఓ సోదరి తన తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి కన్నుమూసిన ఘటన అందరిని కలిచివేస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ తీవ్ర విషాదం ఘటన వీడియో వైరల్‌గా మారి అందిరని కంటతడి పెట్టిస్తుంది. వరాల్లోకి వెళ్తే మహబూబాబాద్‌ జిల్లాలో నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఓ యువతి(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది.

గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనని భావించి శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల వ్యవధిలో తుదిశ్వాస విడిచింది. కండ్ల ముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన సోదరులకు రాఖీ కట్టిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Exit mobile version