Site icon vidhaatha

Protection from Snakes | పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఈ మొక్క‌లు పెంచండి మ‌రి..

Protection from Snakes | వానాకాలం( Monsoon ) ప్రారంభ‌మైంది.. విస్తారంగా వ‌ర్షాలు( Rains ) కురుస్తున్నాయి. ఇక వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో పాములు( Snakes ) బ‌య‌ట విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నాయి. జ‌న‌వాసాల్లోకి ప్ర‌వేశిస్తున్నాయి. అంతేకాదు.. ఇండ్ల‌లోకి దూరి జ‌నాల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇంటి ప‌రిస‌రాల్లో చెత్త‌ను ఉంచ‌డం, పిచ్చి మొక్క‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌.. పాములు వాటిని త‌మ ఆవాసాలుగా మ‌లుచుకుని ఇండ్ల‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంది. అయితే పాములు ఇండ్ల‌లోకి ప్రవేశించ‌కూడ‌దంటే.. చిన్న చిట్కాలు పాటిస్తూ.. ఈ మొక్క‌లు ఇంటి ప‌రిస‌రాల్లో పెంచుకుంటే సరిపోతుంది. మ‌రి ఆ మొక్క‌లు( Plants ) ఏంటో తెలుసుకుందాం..

పుదీనా మొక్క‌లు..( Mint Plant )

ఇంటి ఆవ‌ర‌ణ‌లో పుదీనా మొక్క‌ల‌ను( Mint Plant ) పెంచుకోవాలి. ఈ పుదీనా నుంచి వ‌చ్చే ఘాటైన వాస‌న పాముల‌కు( Snakes ) ప‌డ‌దు. ఈ వాస‌న వ‌ల్ల పాములు ఇంటి ప‌రిస‌రాల‌ను ద‌రిచేరే అవ‌కాశం లేదు. త‌క్కువ ప్ర‌యోజ‌నంతో ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లిగించే మొక్క కాబ‌ట్టి.. దీన్ని వానాకాలంలో మీ ఇంటి ప‌రిస‌రాల్లో ఉండేలా చూసుకోండి.

వెల్లుల్లి, ఉల్లిపాయ మొక్క‌లు..( Onion Plants )

వెల్లుల్లి, ఉల్లిపాయ మొక్క‌లంటే( Onion Plant ) కూడా పాముల‌కు భ‌యం. ఎందుకంటే ఈ మొక్క‌ల నుంచి ఘాటైన ర‌సాయనాలు విడుద‌ల‌వుతాయి. ఈ ర‌సాయనాలు పాముల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాబ‌ట్టి పాములు ఇంటి ప‌రిస‌రాల్లోకి రావ‌డానికి జంకుతాయి. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఇంటి పెర‌ట్లో వెల్లుల్లి, ఉల్లిపాయ మొక్క‌లు పెంచేలా ప్లాన్ చేసుకోండి.

చామంతి మొక్క‌లు..( Chrysanthemums Plants )

చామంతి పువ్వుల( Chrysanthemums Plant ) నుంచి వచ్చే వాసన పాములకు నచ్చదు. వీటిని ఇంటి ముందు ద్వారం దగ్గర లేదా కిటికీ దగ్గర నాటితే.. అవి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే వీటితో ఇంటి అందం కూడా పెరుగుతుంది.

లెమ‌న్ గ్రాస్..( Lemon Grass )

లెమన్ గ్రాస్‌( Lemon Grass )లో సిట్రోనెల్లా అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది పాములనే కాదు దోమలు, ఇతర కీటకాలనూ తరిమేస్తుంది. ఇంటి చుట్టూ ఈ మొక్కలు పెంచితే ఇంటి శుభ్రతకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ మొక్క‌లు పెంచుతూనే.. ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. గుంత‌లు ఉంటే పూడ్చేయాలి. పిచ్చి మొక్క‌ల‌ను కోసేయాలి. రాత్రి వేళ వెలుతురు ఉండేలా చూసుకోండి.. వీలైతే స్నేక్ క్యాచ‌ర్ల ఫోన్ నంబ‌ర్ల‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

Exit mobile version