Snake on Electric Wire | వర్షాకాలం( Monsoon ) వచ్చిందంటే చాలు పాములు విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ సంచరిస్తాయి. చిత్తడి నేలల్లో పాములు( Snakes ) ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. గడ్డి పొదల్లో ఉంటూ.. అన్నదాతలకు( Farmers ) భయానక వాతావరణాన్ని కల్పిస్తాయి. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రైతులు.. ఎంతో జాగ్రత్తగా అడుగు తీసి అడుగేస్తుంటారు.. ఎందుకంటే పాముల భయానికి.
అయితే ఓ పాము చెట్ల కొమ్మల్లో, గడ్డి పొదల్లో ఉండాల్సింది పోయి.. ఎవరూ ఊహించని చోటుకు చేరింది. అది కూడా సర్వీస్ తీగపై సయ్యాట ఆడుతూ ఓ అన్నదాత కంట పడింది ఓ పాము. ఆ దృశ్యాన్ని చూసి సదరు రైతు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఆ దృశ్యం తమాషాగా కనిపించడంతో.. అన్నదాత తన సెల్‌ఫోన్‌లో పాము సయ్యాటను బంధించాడు. పాములు పొలాల్లో, గట్ల వెంబడి సంచరించడం సహజమే కానీ.. ఇలా విద్యుత్ తీగపై సేదదీరయం చూడలేదని సదరు రైతు పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ దృశ్యం ఎక్కడ ఆవిష్కృతమైందో తెలుసా.. మన తెలంగాణ( Telangana )లోని రాజన్నసిరిసిల్ల జిల్లా( Rajanna Siricilla District )లోని గంభీరావుపేట మండలంలో. హమీద్ అనే రైతు పొలంలో సర్వీస్ తీగపై పాము సేదతీరింది.