విధాత: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల వైతాళికుడు, దక్షిణాదిలో సోషలిస్టు ఉద్యమ నిర్మాత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ 90వ జయంతి శుక్రవారం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
నిజాయితీకి మారుపేరుగా నిలిచిన కేశవరావు జాదవ్ జయంతిని శుక్రవారం ఉదయం ఉదయం 10 గంటలకు, హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సభకు సోషలిస్టు నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, జాదవ్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.