విధాత: కాంగ్రెస్ జంగ్ సైరన్ ర్యాలికి అనుమతి నిరాకరణ.దిల్ సుఖ్ నగర్ నుండి ఎల్బీనగర్ వరకు నిరుద్యోగ జంగ్ సైరన్ ర్యాలి ఉండటంతో దిల్ సుఖ్ నగర్,ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులని అరెస్ట్ చేసిన పోలీసులు.కార్యకర్తలంతా దిల్ సుఖ్ నగర్ కి రావాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.లాఠీచార్జ్ చేస్తే మొదటి దెబ్బ నేనే తింటానని,తూటా పేల్చితే మొదటి వరుసలో నేనే ఉంటానని రేవంత్ పేర్కొన్నారు.కార్యకర్తలు ఎవరూ అదైర్యపడొద్దని,ప్రతి కార్యకర్తవి నేను అండగా ఉంటానని తెలిపారు.