Traffic Restrictions | హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) మెహిదీపట్నం( Mehdipatnam )లో ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు డిసెంబర్ 21వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. మెహిదీపట్నంలో స్కైవాక్( Skywalk ) నిర్మాణ పనుల కారణంగా రేతిబౌలి జంక్షన్( Rethibowli junction ) నుంచి ఎస్‌డీ కంటి ఆస్పత్రి వరకు రహదారి మూసి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
పిల్లర్ నంబర్ 1 నుంచి 40 వరకు..
స్కైవాక్ నిర్మాణ పనుల నేపథ్యంలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 1 నుంచి 40 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈ మార్గమధ్యలో రోడ్లు, జంక్షన్లు, పరిసర ప్రాంతాల రహదారులు మూసి ఉంటాయన్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- అత్తాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్, ఫిల్మ్ నగర్ మీదుగా బంజారాహిల్స్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.
- అత్తాపూర్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గుడి మల్కాపూర్, యాదవ్ భవన్, మిరాజ్ కేఫ్ జంక్షన్ రైట్ టర్న్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి మీదుగా నాంపల్లి చేరుకోవాలి.
- టోలిచౌకి నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ వెళ్లే వాహనదారులు నానల్ నగర్ జంక్షన్, బాలికా భవన్, లక్ష్మీనగర్ వయా పిల్లర్ నంబర్ 68, పిల్లర్ నంబర్ 57 వద్ద యూటర్న్, గుడి మల్కాపూర్, యాదవ్ భవన్, మిరాజ్ కేఫ్ జంక్షన్ రైట్ టర్న్, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి, నాంపల్లి మీదుగా లక్డీకాపూల్ చేరుకోవాలని పోలీసులు సూచించారు.
