Site icon vidhaatha

Traffic Restrictions | బీ అల‌ర్ట్.. హైద‌రాబాద్‌లో వారం రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు..!

Traffic Restrictions | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) వాసుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. గ‌ణేశ్ నిమ‌జ్జ‌న( Ganesh Immersion ) కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions )విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 29 నుంచి సెప్టెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వ‌ద్ద వినాయ‌క విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో సెయిలింగ్ క్ల‌బ్ జంక్ష‌న్, వీవీ విగ్ర‌హం, తెలుగు త‌ల్లి జంక్ష‌న్, డీబీఆర్ మిల్స్, క‌వాడిగూడ ఎక్స్ రోడ్, న‌ల్ల‌గుట్ట బ్రిడ్జి, బుద్ధ భ‌వ‌న్ వ‌ద్ద ట్రాఫిక్‌ను డైవ‌ర్ట్ చేయ‌నున్నారు. అప్ప‌ర్ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు.

లిబ‌ర్టీ, ఖైర‌తాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. క‌వాడిగూడ‌, బేగంపేట్, మినిస్ట‌ర్ రోడ్, తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ మీదుగా ట్రాఫిక్‌ను మ‌ళ్లించ‌నున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబ‌ర్ 9010203626 ను సంప్ర‌దించొచ్చ‌ని పోలీసులు తెలిపారు.

Exit mobile version