హైదరాబాద్, సెప్టెంబర్ 6(విధాత): ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జన ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్‌కు చేరుకున్న సీఎం అక్కడ జరుగుతున్న నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు, సందర్శకులు శోభాయాత్ర, నిమజ్జనాలను తిలకించి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్ హరిచందన సీఎంకు వివరించారు. విధుల్లో పాల్గొన్న సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యేవరకు ఇదే స్పూర్తితో పని చేయాలని సూచించారు.