టీఎస్‌ ఎంసెట్‌ ఇక ఉండ‌దు..!

తెలంగాణలో ఎంసెట్ పేరు మారింది. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీ సెట్ గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది

  • Publish Date - January 25, 2024 / 02:41 PM IST
  • టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్పు
  • ప్రవేశ పరీక్షలకు తేదీల ప్రకటన


విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ పేరు మారింది. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీ సెట్ గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( టీఎస్ ఈఏపీ సెట్) సహా ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణ ఈసెట్ పరీక్షను మే 6న ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. టీఎస్ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్)ను మే 8 నుంచి 11 వరకు, (అగ్రికల్చరల్ అండ్ ఫార్మా) మే 12, 13తేదీలలో జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించనుంది. టీఎస్ ఎడ్ సెట్‌ మే 23న మహాత్మాగాంధీ యూనివర్సిటీ, టీఎస్ లా సెట్, పీజీ ఎల్‌ సెట్‌ జూన్ 3న ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. టీఎస్ ఐసెట్‌ను జూన్‌ 4, 5 తేదీలలో కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. టీఎస్ పీజీ ఈసెట్ జూన్ 6 నుంచి 8వరకు జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది.

టీఎస్ పీఈ సెట్ జూన్ 10 నుంచి 13 వరకు శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.