తెలంగాణ విద్యుత్ ఉత్తర, దక్షిణ పంపిణీ సంస్థలు గత నెల ఆపేసిన యూపీఐ ఆధారిత బిల్లు చెల్లింపులను తిరిగి పునరుద్ధరించాయి. జులై ఒకటో తేదీ నుండి ఈ రెండు సంస్థలు యూపిఐ యాప్లు, నెట్ బ్యాంకింగ్, పేమెంట్ గేట్వేల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులను స్వీకరించడం ఆపేసాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ చర్యను రెండు సంస్థలు అప్పుడు చేపట్టాయి.
తాజాగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ బిల్ పే సిస్టమ్(NPCI BBPS) ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థలను తాము తమ చెల్లింపుల వ్యవస్థలో చేర్చుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సౌలభ్యంతో ఇప్పుడు కరెంటు బిల్లులు వందలాది బ్యాంకులు, ఆర్థిక సంస్థల యాప్లు, వెబ్సైట్ల ద్వారా చెల్లించవచ్చు. దీనిని ఇంకా సులభతరం చేయడానికి తాము పంపిణీ సంస్థలకు సహకరిస్తామని భారత్ బిల్ పే సిస్టమ్ స్పష్టం చేసింది.
దీంతో అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు మార్గం సుగమమైంది.