Housing Loan Pay-off Quickly Tips | హౌజింగ్ లోన్ త్వరగా తీరాలంటే తక్కువ కాలపరిమితిని ఎంపిక చేసుకోవాలి. అలా చేస్తే ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. దీని వల్ల ప్రిన్సిపల్ అమౌంట్ కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంది. వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఎక్కువ ఈఎంఐ కట్టడం వల్ల హౌజింగ్ లోన్ పై ఉన్న ఓవరాల్ వడ్డీ రేటు కూడా తగ్గే చాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఓ ఇబ్బంది లేకపోలేదు. ఎక్కువ ఈఎంఐ ఆఫ్షన్ తీసుకోవడం వల్ల నెలవారీ ఖర్చులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
నిర్దిష్ట ఈఎంఐ కంటే ఎక్కువగా డబ్బులు చెల్లించడం ద్వారా కూడా హౌజింగ్ లోన్ భారం త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీ వద్ద డబ్బులు ఉన్న సమయంలో ఒకే నెలలో రెండు ఈఎంఐలు లేదా సంవత్సరంలో నాలుగైదు అదనపు ఈఎంఐలు లేదా ఈఎంఐ చెల్లించినా అదే నెలలో మరికొంత డబ్బు చెల్లిస్తే ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గే చాన్స్ ఉంది. ఒకే సంవత్సరంలో రెండు అదనపు ఈఎంఐలు చెల్లించినా వడ్డీతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గే చాన్స్ ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఈఎంఐ పెంచుకొంటూ వెళ్లాలి. లోన్ ప్రారంభంలో తక్కువ ఈఎంఐ కడితే ప్రతి ఏటా ఈఎంఐను 5 లేదా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలా చేయడం వల్ల కూడా హౌజింగ్ లోన్ తగ్గిపోయే చాన్స్ ఉంటుంది. అయితే ఇది లోన్ తీసుకున్న రుణగ్రహీత ఆర్ధిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న లోన్ ను మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. మరో బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉంటే ఈ లోన్ ఆ బ్యాంకులోకి మార్చుకోవచ్చు. దాని వల్ల కూడా మీపై ఆర్ధిక భారం తగ్గుతుంది. అయితే ఈ లోన్ మార్పిడి వల్ల ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని కూడా బ్యాంకు అధికారులతో చర్చించాలి. ఈ ఫీజు ఎక్కువగా ఉంటే మరో బ్యాంకుకు లోన్ ట్రాన్స్ ఫర్ చేసుకొన్నా నష్టమే. మరోవైపు వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించిన సమయంలో మీ లోన్ కు వడ్డీ రేటు తగ్గిందా లేదా చెక్ చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
Credit Score : క్రెడిట్ స్కోర్ ను ఎలా లెక్కిస్తారు?
Bone-02 glue | మూడు నిమిషాల్లో ఎముకలు అతికించే చైనీస్ అద్భుతం – బోన్-02 గ్లూ
Life Imprisonment to Dogs | ఇక కుక్కలకు జీవిత ఖైదు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం