Telangana’s Welfare Push | విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గేమ్ ఛేంజర్ కాబోతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. గతంలో రేషన్ కార్డుల(Ration card) జారీ నిర్లక్ష్యం చేశారని, దొడ్డు బియ్యం ఎక్కువ శాతం కోళ్ల ఫామ్, బిర్ల కంపెనీలకు వెళ్ళేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట(Suryapet) జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 3 కోట్ల 10 లక్షల మందికి సూపర్ ఫైన్ రైస్ ఇస్తున్నామన్నారు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని, నేడు.. వీర భూమి, పోరాటాల గడ్డ తుంగతుర్తి నుంచి “కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం” చేస్తున్నామన్నారు.
గతంలో.. బై ఎలక్షన్ టైమ్ లోనే కొన్ని కొత్త రేషన్ కార్డుల ఇచ్చారని విమర్శించారు. నూతనంగా 5 లక్షల రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. దేవాదుల ప్యాకేజీ 6 ద్వారా గోదావరి జలాలను తుంగతుర్తి(Tungaturthi), పాలకుర్తి(Palakurthi) నియోజకవర్గలకు సాగు నీరు అందించాలని సీఎం రేవంత్ రెడ్డిని(CM.Revanth reddy) ఉత్తమ్ కోరారు. మూసి పరిధిలో.. బునాడిగానీ కాల్వ, కేతిరెడ్డి ఫీడర్ ఛానెల్ పూడిక తీసి పనులు చెపడుదామన్నారు. దీనికి భూసేకరణ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నారు. కాళేశ్వరం కట్టింది బీఆర్‌ఎస్(BRS) పాలనలోనే.. కూలింది వారి పాలనలోనే అని విమర్శించారు. ఎక్కువ నీరు అందించి.. గత ఏడాదిలో 220 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని వెల్లడించారు. గత సీజన్ లోనే.. 66.7 లక్షల ఎకరాల్లో.. 160 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని గుర్తు చేశారు. తన స్వగ్రామం తాటిపాముల, తుంగతుర్తి అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తానని మంత్రి ఉత్తమ్ హామి ఇచ్చారు.