Site icon vidhaatha

అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

విధాత, హైదరాబాద్: రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖా హెచ్చరిస్తున్న నేపద్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతో పాటు చెరువుల భద్రత పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిఘా పెంచాలని ఆయన సూచించారు. విపత్తులు సంభవించే సూచనలు కల్పిస్తే అధికార యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సహా అన్నివిభాగాల అధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసుకుంటూ వర్షాలతో ఎటువంటి నష్టాలు కలుగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టేందుకు నీటిపారుదల శాఖాధికారులు సన్నద్ధం కావాలని ఆయన చెప్పారు.

క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటు ఎటువంటి సందర్భం ఎదురైన తక్షణ నివారణ చర్యలు తీసుకునేందుకు వీలుగా సిద్ధం కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ లతో పాటు ఆయా జిల్లాల సి.ఇ లకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version