GHMC Trifurcation : జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ సర్కార్ పై హైకోర్టు సీరియస్

జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించిన రాష్ట్ర నిర్ణయంపై హైకోర్టు సీరియస్ అయింది. జీవో 55పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

GHMC Trifurcation

విధాత, హైదరాబాద్ : జీహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో 55ని సవాల్‌ చేస్తూ వ్యాపారి గురువారెడ్డి జీహెచ్ఎంసీ విభజనపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2027 జనగణమన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించిందని, కేంద్ర సర్క్యూలర్ కు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని విభజించిందని పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

జనగణన ముగిసే వరకు ఈ జీవోపై స్టే విధించాలని కోరారు. పిటిషన్ వాదన విన్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడింది. మూడు వారాల్లో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశిస్తూ..నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

అంతకు ముందు ఇదే అంశంపై సోమవారం హైకోర్టులో దాఖలైన ఇతర పిటిషన్లపై కూడా విచారణ జరిగింది. జీహెచ్ఎంసీ విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ మున్సిపాలిటీల (సవరణ) చట్టం-2026ను సవాలు చేస్తూ వ్యాపారవేత్తలు ఆర్. లక్ష్మణ్, రాజమణి రాజు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), 19 (స్వేచ్ఛ) మరియు 21 (జీవించే హక్కు)లకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. 1955 మున్సిపాలిటీ చట్టం ప్రకారం, నగరం పరిధిని మార్చాలన్నా లేదా విస్తరించాలన్నా కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరిపి, నోటిఫికేషన్ ద్వారా ప్రక్రియను చేపట్టాలని వాదించారు. తద్వారా ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత ఉంటాయని తెలిపారు. వారి వాదన విన్న చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని తెలియజేస్తూ నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి :

అందుకే ప్రజలు బీఆర్ఎస్ ఓటెయ్యడం లేదు : కడియం ఘాటు వ్యాఖ్యలు
Leopard Attack | షాకింగ్‌.. బైక‌ర్‌పైకి దూకిన చిరుత‌.. అత‌డు ఏం చేశాడో చూడండి..?

Latest News