Vemulawada Temple | రాజన్న ఆలయం బంద్ కాలేదు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు

విధాత, వేములవాడ : రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భీమేశ్వర ఆలయంలో తుది దశకు చేరిన ఏర్పాట్లను ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ వారు మాట్లాడుతూ రాజన్న ఆలయం అభివృద్ధి విస్తరణ చేపడుతున్న నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయ భక్తుల వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల దృష్ట్యా 150 కోట్లతో ఆలయ అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. ఇప్పటికే వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు సాగుతున్నాయని తెలిపారు. విస్తరణ సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో భక్తుల దర్శనాలు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. రాజన్న ఆలయం బంద్ అనేది ఆ వాస్తవమని, ప్రతినిత్యం ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు ఏకాంతంగా జరుగుతాయన్నారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తాం అని ఆది శ్రీనివాస్ తెలిపారు. విప్ వెంట ఈవో రమాదేవి ఈఈ రాజేశ్ డీఈ రఘునందన్ ఏఈఓ శ్రీనివాస్, ఉమేష్ శర్మ ఆలయ స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ తదితరులు ఉన్నారు.