Vemulawada | వేములవాడ రాజన్న దర్శనం బంద్.. ఎందుకంటే?

దక్షిణ కాశీ గా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) తెల్లవారు జాము నుంచే అధికారులు ఆలయం మూసివేశారు.

విధాత, హైదరాబాద్ :

దక్షిణ కాశీ గా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) తెల్లవారు జాము నుంచే అధికారులు ఆలయం మూసివేశారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా భారీ రేకులు ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనార్థం ఆలయం ముందు భాగంలో రాజన్న ప్రచార రథం వద్ద ఎల్‌ఈడీ స్రీన్లు పెట్టారు.

కాగా, భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కులు ఆర్జిత సేవల కోసం భీమేశ్వరాలయంలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి రాజన్న ఆలయ పరిసరాల్లో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణం భాగాలలో ప్రాకారం, పడమర వైపు ఉన్న నైవేద్యం తయారు చేసే మంటపం, ఆలయ ఈవో ఆఫీసును ఇప్పటికే కూల్చివేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు ఏర్పాటు చేశారు.

అయితే, ఆలయాన్ని మూసివేయడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. అభివృద్ధి పేరిట రాజన్న దర్శనం నిలిపివేయడం తగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈశ్వరుడికి అతి ప్రీతికరమైన మాసం కార్తీకమాసం కావడంతో రాజన్న భక్తులు ఆలయాని పోటెత్తుతున్నారు. కానీ, మెయిన్ గేట్ మూసివేయడంతో తీవ్ర నిరాశ చెంది.. ఎల్ఈడీ స్క్రీన్ పై ఏర్పాటు చేసిన స్వామి వారి ప్రతిమలను మొక్కి వెళ్లిపోతున్నారు.