Site icon vidhaatha

Vijayashanti : కేసీఆర్ ఫామ్‌ హౌజ్‌లో ఉంటే ఎలా?

Vijayashanti Vs KCR

హైదరాబాద్, ఆగస్ట్ 30(విధాత): మాజీ సీఎం కేసీఆర్‌(KCR) గురించి ఎమ్మెల్సీ విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి(Assembly) రాకుండా ఫామ్‌హౌజ్‌లో(Farm House) ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) గురించి మాట్లాడాలంటే కేసీఆర్ వెంటనే సిక్ అవుతారని ఎద్దేవా చేశారు. శాసన సభకు రానని చెప్పి తన పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తోందని ఆమె వెల్లడించారు.

కాగా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Maganti Gopinath) మృతిపట్ల శ్యాసన సభలో సంతాపం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్, హరీష్ రావుల ఆద్వర్యంలో రైతులకు మద్దతుగా యూరియా కోసం గన్‌పార్క్ వద్ద యూరియా కోసం ధర్నా చేశారు. అనంతరం సచివాలయం వద్దకు గుంపులుగా వెళ్లి సెక్రటేరియట్ గేట్ వద్ద బైటాయించి గనణపతిబప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version