Yadadri : యాదాద్రి జిల్లాలో వైన్స్ ల రిజర్వేషన్లు ఖరారు

యాదాద్రి జిల్లాలో 2025–27 రిటైల్ వైన్స్ షాప్ కేటాయింపు డ్రా పూర్తయ్యింది; 82 దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.

yadadri-district-finalizes-liquor-shop-reservations-through-draw-for-2025-27

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ 2025–27కు సంబంధించిన కొత్త ఏ4 రీటైల్ మద్యం దుకాణాల కేటాయింపు నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వైన్స్ ల డ్రా నిర్వహించింది. జిల్లా కలెక్టర్ వి.హనుమంత రావు సమక్షంలో జిల్లాలోని మొత్తం 82దుకాణాలకు డ్రా తీశారు. ఇందులో గౌడ కులస్తులకు 24 వైన్స్ లు, షెడ్యూల్డ్ కులాలకు 7, షెడ్యూల్డ్ తెగలకు 1 వైన్స్ కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ, గిరిజన అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.