విధాత : యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్ చెరువు వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో(Bibinagar Road Accident) ఇద్దరు దుర్మరణం చెందారు. హైవేపై వేగంగా వెలుతున్న థార్ వాహనం అదుపుతప్పి రోడ్డు ఢివైడర్ ను ఢీ కొట్టింది. అదే వేగంతో రోడుపక్కన నిలుచున్న యువతి, యువకుడిపై దూసుకెళ్లింది. కారు ఢీ కొట్టిన వేగానికి యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. యువతి ఎగిరి రోడ్డుకు పక్కనే ఉన్న చెరువులో పడి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో థార్ వాహనం తుక్కుతుక్కు అయిన తీరు చూస్తే..కారు వేగం తీవ్రత అర్థమవుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
