Raghava Lawrence | ‘సూపర్‌స్టార్’ ట్యాగ్ కోట్లాట.. లారెన్స్ మళ్లీ చిచ్చు పెట్టాడుగా..

Raghava Lawrence | విధాత: కోటకు రాజు ఒక్కడే ఉంటాడు. రాజే ఆ రాజ్యానికి అన్నీ అవుతాడు. ఇది అందరికీ తెలిసిన మాటే.. మరి రాజులు పోయి, రాజ్యాలు నశించినా ఇంకా ఆధిపత్య పోరు మాత్రం పోలేదు. ఇప్పటికీ నేను గొప్పంటే నేను గొప్పనే తీరూ మారలేదు. అంతా గొప్పవారే, అభిమానుల మనసులు గెలుచుకున్నవారే.. మరి అందులో రాజు ఎవరు? ఇదిగో ఇప్పుడు ఇదే చిక్కొచ్చింది. ఆధిపత్యం కోసం అభిమానులు పెడుతున్న చిచ్చు రోజు రోజుకూ దావానలంలా […]

  • Publish Date - September 8, 2023 / 06:19 AM IST

Raghava Lawrence |

విధాత: కోటకు రాజు ఒక్కడే ఉంటాడు. రాజే ఆ రాజ్యానికి అన్నీ అవుతాడు. ఇది అందరికీ తెలిసిన మాటే.. మరి రాజులు పోయి, రాజ్యాలు నశించినా ఇంకా ఆధిపత్య పోరు మాత్రం పోలేదు. ఇప్పటికీ నేను గొప్పంటే నేను గొప్పనే తీరూ మారలేదు. అంతా గొప్పవారే, అభిమానుల మనసులు గెలుచుకున్నవారే.. మరి అందులో రాజు ఎవరు? ఇదిగో ఇప్పుడు ఇదే చిక్కొచ్చింది. ఆధిపత్యం కోసం అభిమానులు పెడుతున్న చిచ్చు రోజు రోజుకూ దావానలంలా రాజుకుంటుంది. విషయంలోకి వెళితే..

కోలీవుడ్‌లో టాప్ హీరో ఎవరు? ఇదిగో ఇదే ఇప్పుడు తెర వెనుక, చాపకింద నీరులా రాజుకుంటున్న చిచ్చు. అభిమానుల మనసుల్లోని అనుమానం. ఎవరు సూపర్ స్టార్, ఎవరు కింగ్ అనేదే ప్రశ్న. జైలర్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ నుంచి ఈ రచ్చ మొదలైంది. ఈ సందర్భంగా రజినీకాంత్ చేసిన వాఖ్యలు, వాటికి నిర్మాత కళానిధి మారన్ “సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ ఒక్కరే. ఈ ట్యాగ్ మరెవరికీ సొంతం కాదు..’’ అనడం, కూడా ఈ చర్చకు కారణమయ్యాయి.

ఇదంతా ఇలయదళపతి విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉందని కొందరి వాదన. ఇది సరిపోదన్నట్టు అగ్గికి ఆజ్యం పోస్తూ రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. సూపర్ స్టార్ ట్యాగ్ వాడుతున్నారు అది నాకు ఇబ్బందిగా ఉందని రజనీ అంటే సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ మాత్రమే ఆ ట్యాగ్ మరెవరికీ సొంతం కాదని ప్రొడ్యూసర్ కళానిధి అన్నారు.

వీటికి కౌంటర్ గా రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ ట్యాగ్‌ను విజయ్ వాడటం లేదు. ఆయన ఫ్యాన్స్ ముద్దుగా అలా పిలుచుకుంటారంతే దానిలో తప్పేముంది అని కామెంట్స్ చేశాడు. అయిపోయిందనుకున్న విషయాన్ని మళ్ళీ రెచ్చగొట్టి రచ్చ చేశాడు రాఘవ లారెన్స్.

అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ ఫ్యాన్స్, ఇళయదళపతి విజయ్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని రచ్చ చేస్తున్నారు. ‘జైలర్’ మూవీ కలెక్షన్స్ విషయంలోనూ ఈ కామెంట్స్ ఆగలేదు.

విజయ్ సినిమా ‘వారిసు’ మూవీ వసూళ్ళతో కంపేర్ చేస్తూ కోలీవుడ్‌లో విజయ్‌కి సూపర్ స్టార్ రజనీ అంటే ఏంటో తెలియజేశాడని ఓ అభిమాన వర్గం కామెంట్ పోస్ట్ చేస్తుంటే, నార్త్ ఇండియాలో ‘వారిసు’ కలెక్షన్లు ఎవరూ దాటలేరని సవాల్ చేస్తూ మరో వర్గం పోస్టులు చేస్తుంది. ఇలా వేడి పెంచిన ఈ ఆధిపత్య పోరు ఎంతవరకూ వెళ్ళనుందో కాలమే చెప్పాలి