Tamanna Bhatia |
చార్మింగ్ ఫేస్, స్క్రీన్‌కి ఫిట్‌గా అందంగా కనిపిస్తూ దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు గడిపేసిన చార్మింగ్ బ్యూటీ తమన్నా. అందరూ ఈ భామని మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. కెరియర్ ప్రారంభంలో అంతగా ఎక్స్‌పోజ్ చేయని ఈ మిల్కీ భామ.. మరిప్పుడో ఇక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే కాలం దగ్గర పడిందనో ఏమో.. బోల్డ్ సీన్స్‌తో బెంబేలెత్తిస్తోంది.
ఓ పక్క పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉండి, ఇటు అందాల ఆర బోతలోనూ ముందుంది. ఓటీటీలో సిరీస్‌లతో, సోషల్ మీడియాలో ఫోటో షూట్స్‌తో తన అందాల ఆరబోతకు కొదవే లేదంటే నమ్మాలి. చిక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు.. అందాల రాశి కాసిన్ని అందాలను విసిరేసినా పరవాలేదనిపించేలా ఉందీ అమ్మడి తంతు. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను సోషల్ మీడియాకు వదిలింది.. అవి తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘జైలర్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘కావాలయ్యా.. నువు కావాలయ్యా’ అంటూ పొడవాటి స్కర్ట్ రెండు పక్కలా గ్యాప్‌తో థైయ్స్ కనిపించేలా సెక్సీ లుక్ వేసుకుని స్టెప్పులేసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో డాన్స్ చేసి మరీ ప్రమోట్ చేసింది సినిమాని.
ఈ మైకం నుంచి బయటపడకముందే మిల్కీ మరో షోతో తెగ వైరల్ అవుతుంది. తమన్న క్లివేజ్ అందాలతో యూత్‌కి కిక్ ఇస్తుంది. వెబ్ సిరీస్‌లలో రెచ్చి పోతుందనుకుంటే ఇప్పుడు సినిమాల్లోనూ తన అందాల ఆరబోత మొదలైంది. ఇక స్పెషల్ షోల విషయం వేరే చెప్పాలా.. బికినీ షోస్, బాట్ క్లివేజ్ షోలలో ఈ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది.
తమన్నాకి బికినీ ట్రీటేం కొత్త కాదు. ఆమధ్య ‘ఎఫ్2’లో అల్లాడించేసింది. ఇప్పుడు ‘జైలర్’ కోసం ఆమె చేస్తున్న క్లివేజ్ షో మరో లెవల్లో ఉందంటే అతిశయోక్తి కానే కాదు. అయితే గ్లామర్ డోస్ పెరగడంపై పలు రకాల కామెంట్స్ కూడా ఆమెపై వినిపిస్తున్నాయ్.
ఆమధ్య తమన్నా హద్దులు దాటేసిందని కొందరంటుంటే, దాటినా అందంగానే ఉందని వెనకేసుకొచ్చే యూత్ సపోర్ట్ కూడా తమన్నాకు బాగానే ఉంది. అయితే వయసులో పెద్ద హీరోలతో నటించడం గురించి ఏజ్ గ్యాప్ గురించి అడిగినప్పుడు తన మనసులో మాటను బయటపెట్టింది.
ఈ రియాక్షన్స్ మీద రియాక్ట్ అయిన మిల్కీ బ్యూటీ నటీనటులకు మధ్య ఏజ్ గ్యాప్ అనే మాటతో సంబంధం ఉండదు. అక్కడ పాత్రలు మాత్రమే చూడాలి. మన దేశంలోనే ఇలా ఏజ్ గురించి పట్టించుకుంటాం కానీ అంతర్జాతీయ స్థాయిలో అసలు ఎవరూ ఏజ్ చూడరని క్లాస్ పీకింది.
ఇక ఈ సందర్భంగా హాలీవుడ్ లోని ప్రముఖుల్ని ఉదహరిస్తూ టామ్ క్రూజ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నాడు అతని వయసు అరవై ఏళ్ళు. నేనైతే అరవై ఏళ్ళు వచ్చనా సరే ఇంత హుషారుగానే ఉంటూ డాన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది. అంటే గ్లామర్ పాళ్ళు కూడా ఇలాగే ఉండబోతుందని నొక్కి చెప్పిందన్నమాట అమ్మడు.
ఇక తమన్నా సినిమాల విషయంలోనూ గ్లామర్ డోస్ పెరిగింది. అవకాశాలు తగ్గుతున్నాయనో, లేక ఇక తన హవా ఎన్నాళ్ళో సాగదనో ఏమనుకుందో ఏమోగానీ కాస్త గ్లామర్ పెంచే నటించేస్తుంది. ఇక వెబ్ సిరీస్ కోసం తమన్న కాస్తా బోల్డ్‌గా కనిపించడానికీ ఒప్పుకుంది. వీటిల్లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లోనూ అంతే బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమన్నాని ఇలాంటి సీన్లలో చూస్తామని ఎవరూ ఊహించి కూడా ఉండరు.