IRCTC Tour | తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్ల దొరకలేదా..? మరి ఐఆర్‌సీటీసీ ‘పూర్వా సంధ్య’ ప్యాకేజీ ట్రై చేయండి..!

IRCTC Tour | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. శ్రీవారి దర్శనానికి భక్తులు తప్పనిసరిగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. ఇప్పటికే ప్రత్యేకం దర్శనం కోటా పూర్తయిన విషయం తెలిసిందే.

  • Publish Date - April 27, 2024 / 10:39 AM IST

IRCTC Tour | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. శ్రీవారి దర్శనానికి భక్తులు తప్పనిసరిగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. ఇప్పటికే ప్రత్యేకం దర్శనం కోటా పూర్తయిన విషయం తెలిసిందే. సెలవుల్లో తప్పనిసరిగా దర్శనానికి వెళ్లాలని వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలోని శ్రీవారి ఆలయంలో పాటు తిరుపతిలో పలు క్షేత్రాలను సైతం దర్శించే అవకాశం కలుగనున్నది. నాలుగురోజుల పాటు ఈ ప్యాకేజీలో ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి సరికొత్త ప్యాకేజీని నడుపుతున్నది. ఐఆర్‌సీటీసీ ‘పూర్వా సంధ్య’ పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. నాలుగు రోజుల పాటు టూర్‌ సాగుతుంది. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. మే 4న టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణం వివరాలు..

ప్రయాణం తొలిరోజు మే 4న లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 6.25గంటలకు 12734 రైలు బయలుదేరుతుంది. సాయంత్రం 7.05 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. 8.35 గంటలకు నల్గొండ నుంచి బయలుదేరి వెళ్తుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్తారు. అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలకు వెళ్తారు. రాత్రి తిరుపతిలోనే బస ఉంటుంది. మూడోరోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని 8.30 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అదే రోజు సాయంత్ర 06.20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్​కు చేరురుకుంటారు. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. సికింద్రాబాద్‌ 5.35 గంటలకు రైలు చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.

ప్యాకేజీ ఎంత..?

ఐఆర్‌సీటీసీ ‘పూర్వా సంధ్య’ ప్యాకేజీలో రెండు కేటగిరిలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్‌ క్లాస్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.7,720 చెల్లించాల్సి ఉంటుంది. ట్విన్‌ షేరింగ్‌కు రూ.5860 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల షేరింగ్‌కు రూ.5,660గా నిర్ణయించారు. స్టాండర్డ్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్‌ క్లాసులో సింగిల్‌ షేరింగ్‌కు రూ.9570 చెల్లించాలి. ట్విన్‌ షేరింగ్‌కు రూ.7720.. ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.7510గా నిర్ణయించారు. ఈ క్లాస్లో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు సైతం ప్రత్యేకంగా రేట్లు ఉంటాయి. వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరింది.

Latest News