విధాత, హైదరాబాద్ :
కాచిగూడలో రైల్వే ట్రాక్ పై కారు నిలిపి ఉంచడం కలకలం రేపుతోంది. ట్రాక్ కు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి కారు పెట్టినట్లు గుర్తించిన రైల్వే సిబ్బంది. ట్రాక్ పైనే ఓ ఆగంతుకుడు కారు వదిలేసి వెళ్లిపోయాడు. ఇది గుర్తించిన ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జనాలు ఎవరూ కూడా దరిదాపుల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కాసేపు రైలు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాగా, బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
