Site icon vidhaatha

IRCTC Thailand Tour | థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లొద్దామా..? ఆరురోజుల టూర్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..

IRCTC Thailand Tour | విశాఖపట్నం వాసులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం థాయ్‌లాండ్‌ ప్యాకేజీని ప్రకటించంది. ఇందులో విమానంలో ప్రయాణం ఉంటుంది. ‘మ్యాజికల్‌ థాయ్‌లాండ్‌ ఎక్స్‌ విశాఖపట్నం’ పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీ ఈ ఏడాది సెప్టెంబర్‌ 7న అందుబాటులో ఉన్నది. ప్యాకేజీలో పర్యటన ఆరు రోజులు, ఐదురాత్రుల పాటు కొనసాగుతుంది. వైజాగ్‌ నుంచే ప్రయాణం ఉంటుంది. ప్యాకేజీ సెప్టెంబర్‌ 7న అందుబాటులో ఉండగా.. ముందస్తుగా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రయాణం ఇలా..

ప్యాకేజీలో భాగంగా తొలిరోజు సెప్టెంబర్‌ 7న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరాల్సి ఉంటుంది. బ్యాకాంక్‌కు (FD-117) బయలుదేరి వెళ్తారు. మరుసటి రోజు పట్టాయాకు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజ‌నం తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. అనంత‌రం నోంగ్‌ నూచ్‌ గార్డెన్‌ సందర్శనకు వెళ్తారు. దీన్ని పట్టాయ గార్డెన్‌గానూ పిలుస్తారు. ఆ రోజంతా పట్టాయాలోనే గడుపుతారు. మూడో రోజు అల్పాహారం ముగించుకున్న తర్వాత కోరల్‌ ఐస్‌లాండ్‌ టూర్‌కి వెళ్తారు. ఈ ప్రాంతానికి స్పీడ్ బోట్ చేరుకుంటారు.

అనంతరం పట్టాయాకు తిరిగి వస్తారు. నాల్గో రోజు సఫారీ పర్యటన ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి నుంచి బ్యాంకా‌క్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధి చెందిన పలు ప్రాంతాలను వీక్షిస్తారు. ఐదురోజు ఉదయం అల్పాహారం తర్వాత హాఫ్‌ డే సిటీ టూర్‌ ఉంటుంది. ఇందులో భాగంగా గోల్డెన్‌ బుద్ధాని సందర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడే రెస్టారెంట్‌లో భోజనం ఉంటుంది. అనంత‌రం శ్రీరాచా టైగర్‌ జూకి వెళ్తారు. ఆరో రోజు ఉద‌యం గ్రాండ్‌ ప్లేస్‌ సందర్శన ఉంటుంది. లంచ్‌ తర్వాత సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు విశాఖపట్నానికి చేరుతారు. దాంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ప్యాకేజీ విషయానికి వస్తే.. సింగిల్‌ టికెట్ ధరలు వివ‌రాలు చూస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 66735 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి అయితే రూ.57,815 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా విమాన టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌తో పాటు ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ సైతం ప్యాకేజీలోనే వర్తిస్తుంది. లంచ్‌, డిన్నర్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌లోనే ఉంటుంది. వివరాల కోసం irctctourism.com సంప్రదించాలని సూచించింది.

Exit mobile version