Sunflower field | హైదరాబాదీల్లో చాలా మంది నిత్యం బిజీగా గడుపుతుంటారు. వీకెండ్( Weekend ) సమయాల్లో పర్యాటక ప్రాంతాలకు( Tourist Places ) వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పార్కులు( Parks ), బీచ్‌లు( Beach ), ఆలయాలకు( Temples ) వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఇక ఆయా టూరిస్టు ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. దాంతో పాటు అక్కడున్న ప్రకృతి( Nature )లో ఒదిగిపోతూ.. ఆ రమణీయతను తమ కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. సెల్ఫీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటారు.
అయితే సమయం లేని వారు హైదరాబాద్( Hyderabad )కు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారిస్తుంటారు. గండిపేట( Gandipet ), వికారాబాద్, యాదాద్రి, భద్రకాళి టెంపులు, లక్నవరం, రాచకొండ, జూరాల, నాగార్జున సాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ ప్రాంతాలన్నీ ఒక్కరోజులో చుట్టేయొచ్చు. ఖర్చు కూడా తక్కువే అవుతుంది. ఈ ప్రాంతాల సరసన ఓ సన్ ఫ్లవర్ తోట( Sunflower field ) కూడా చేరింది. ఇప్పుడు ఆ సన్ ఫ్లవర్ తోట పర్యాటక ప్రాంతం( Tourist Place )గా మారింది. మరి ఆ సన్ ఫ్లవర్ తోట ఎక్కడుంది..? హైదరాబాద్ నగరానికి ఎంత దూరంలో ఉందో తెలుసుకుందాం.
ఈ సన్ ఫ్లవర్ తోట( Sunflower field ) హైదరాబాద్‌కు అతి సమీపంలోనే ఉంది. అంటే 73 కిలోమీటర్ల దూరంలో అన్నమాట. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్లే దారిలో ముద్దాపూర్( Muddapur ) గ్రామంలోని కాసా ఫార్మ్( KASA Farm ). ఈ వ్యవసాయ క్షేత్రం( Farm House ) నుంచి కొండపోచమ్మ సాగర్( Kondapochamma Sagar )కు కూడా వెళ్లొచ్చు. కాసా ఫార్మ్( KASA Farm )లో ప్రధానంగా ఆకర్షిస్తున్న పంట ఏందంటే.. సన్ ఫ్లవర్ తోట. పర్యాటకులను ఆకర్షిస్తూ ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇక కాసా ఫార్మ్‌కు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి 2 గంటల సమయం పడుతుంది. అంటే రానుపోను ప్రయాణానికి 4 గంటల సమయం పడుతుంది.
సన్ ఫ్లవర్ తోట సందర్శనకు ఫీజు ఎంత..?
వాస్తవానికి ఇది ప్రయివేటు ఫార్మ్. కానీ సన్ ఫ్లవర్ తోటలోకి ప్రవేశించేందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. సన్ ఫ్లవర్ తోటకు కానీ అక్కడున్న ఇతర పంటలకు ఎలాంటి హానీ కలిగించకుండా.. ఫార్మ్‌లో పర్యటిస్తూ ఫొటోలు తీసుకోవచ్చు.
మరి ఎప్పుడు సందర్శించొచ్చు..?
సన్ ఫ్లవర్ తోటను సందర్శించేందుకు సమయం అంటూ ఏమీ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పొద్దు తిరుగుడు తోటను సందర్శించొచ్చు. మార్చి నుంచి జూన్ వరకు సన్ ఫ్లవర్ పంట కాలం. ఈ సమయంలో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇక ఈ సన్ ఫ్లవర్స్ సూర్యుడు ఎటు తిరిగితే అటు ఈ పువ్వులు తిరగడం వల్ల వీటికి పొద్దు తిరుగుడు పువ్వు( Poddu Tirugudu Puvvu )లు అని పేరు వచ్చింది.