Site icon vidhaatha

Visa Free Entry | వీసా లేకుండానే ఎంట్రీ..! భారత పర్యాటకుకు శుభవార్త చెప్పిన థాయ్‌లాండ్‌..!

Visa Free Entry | వేసవి సెలవుల్లో చాలా మంది పలు దేశాలకు వెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకోసం వీసాలు తీసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం వీసాలు తీసుకోవడం తప్పనిసరి. కానీ, కొన్ని దేశాలు మాత్రం భారతీయులకు ఆయా దేశంలో వీసా ఊసు లేని పర్యటనలకు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమలో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పర్యాటకులకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తమ దేశానికి వచ్చిన పర్యాటక భారతీయులకు వీసా ఫ్రీ నిబంధన అమలు చేస్తున్నది. తాజాగా మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ఇక థాయ్‌లాండ్‌ వెళ్లాలనుకునే పర్యాటకులకు వీసా అవసరం ఉన్నది. పాస్‌పోర్టు ఉన్నవారంతా ఆ దేశంలో నెల రోజుల పాటు పర్యటించేందుకు అవకాశం ఉన్నది. వాస్తవానికి భారత్‌, తైవాన్‌ నుంచి తమ దేశంలో పర్యాటకులకు వీసా ఫ్రీ నిబంధనను గతేడాది 2023 నవంబర్‌ 10 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ గడువు తాజాగా ముగిసింది. ఈ నిర్ణయం మంచి ఫలితాలు ఇవ్వడంతో వీసా ఫ్రీ నిబంధనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్‌ థాయ్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ఈ నిబంధన నవంబర్‌11, 2024 వరకు అమల్లో ఉంటుంది.

భారత్‌ నుంచి థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు నాలుగు గంటల ప్రయాణ సమయం పడుతుంది. థాయ్‌లాండ్‌ ప్రకృతి అందాలతో అగ్ర పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ దేశాన్ని ది ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని పిలుస్తుంటారు. థాయ్‌లాండ్ ఓ ఉష్ణమండల దేశం కాగా.. ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలుంటాయి. థాయిలాండ్ సందర్శించేందుకు వసంతకాలం అంటే మార్చి నుంచి మే వరకు ఉత్తమ సమయం. ఈ సమయంలో ఆ దేశంలో ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటాయి.

Exit mobile version