banded krait snake| చూడటానికి అద్బుత అందం..నిలువెల్ల విషం

చూడటానికి అద్బుతంగా..ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రాత్రి వేల తనకున్న రంగుల శరీరంతో మిలమిల మెరిసిపోతూ వయ్యరంగా సాగుతుంది. కాని దగ్గరకు వెళితే మాత్రం తన విషంతో చంపేస్తుంది. ఇదేదో విషకన్య కాదండోయ్..విషపూరిత పాము కథ.

విధాత : చూడటానికి అద్బుతంగా..ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రాత్రి వేల తనకున్న రంగుల శరీరంతో మిలమిల మెరిసిపోతూ వయ్యరంగా సాగుతుంది. కాని దగ్గరకు వెళితే మాత్రం తన విషంతో చంపేస్తుంది. ఇదేదో విషకన్య కాదండోయ్..విషపూరిత పాము కథ. కట్ల పాము జాతికి చెందిన బ్యాండెడ్ క్రైట్(banded krait snake)  బుంగారస్ ఫాసియాటస్ పాము పసుపు, నలుపు రంగులతో మెరిసే చర్మంతో రాత్రి వేళ చిన్న కాలువ నీటిలో ఆహారం వేదుకుతూ వెలుతున్న వీడియో వైరల్ గా మారింది.

భారత్ తో పాటు అగ్నేసియా దేశాల్లో మనుగడ సాగించే కట్ల పాముల శాస్త్రీయ నామం బ్యాండెడ్ క్రైట్. వీటిలో పసుపు, నలుపు రంగు చారలతో ఉంటే జాతి కట్ల పామును బుంగారస్ ఫాసియాటస్ గా కూడా పిలుస్తారు. ఇది అడవులు, పొలాలు, కాలువలు, నదులు, మానవ నివాసాల పరిసరాల్లో ఎక్కువగా జీవిస్తూ..కప్పలు, చేపలు, ఎలుకలు, చిన్న పాములను ఆహారంగా వేటాడుతాయి. వీటీలో ఏకంగా 18జాతులు, 5 ఉప జాతులు ఉండటం విశేషం. ఈ పాము జాతులు 2మీటర్ల వరకు పెరుగుతాయి. అత్యంత విషపూరితమైన న్యూరోటాక్సిక్ విషాన్ని(Neurotoxic Venom) కలిగి ఉండే కట్ల పాములు మనుషుల ప్రాణాలకు కింగ్ కోబ్రా, రస్సెల్ వైపర్ మాదిరిగా అత్యంత ప్రమాదకరం. రాత్రి వేళ చురుగ్గా ఉండే ఈ పాములుతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

Latest News