విధాత: పంబానదికి వరద ఉధృతి పెరగడం శబరిమల ఆలయ దర్శనాలపై పడింది. వరద పెరగడంతో శబరిమల ఆలయంలోకి భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద తీవ్రత తగ్గిన తరువాతే ఆలయంలోకి భక్తులను అనుమతి స్తామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, కల్కి-ఆంథోడ్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది.
ఏ క్షణంలోనైనా రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నదని దిగువ ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా పంబానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేరళలోని నదులకు వరద చేరింది.
వారం రోజుల క్రితమే శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఇంతలోనే పంబానదికి వరద రావడంతో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.