Elderly Woman | ఫుట్‌పాత్‌పై వాహ‌నం న‌డిపేందుకు య‌త్నించిన బైక‌ర్‌ను ధైర్యంగా అడ్డుకున్న వృద్ధురాలు.. VIDEO

కేర‌ళ‌ (Kerala)లోని కోజికోడ్‌ (Kozhikode)లో ఫుట్‌పాత్‌పై వాహ‌నం న‌డిపేందుకు ప్ర‌య‌త్నించిన బైక‌ర్‌ (Biker)ను ఓ వృద్ధురాలు (Elderly Woman) ధైర్యంగా అడ్డుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ (Viral Video)గా మారింది.

footpath viral video

Elderly Woman | రోడ్ల‌పై వాహ‌నాలు వెళ్లాలి.. ఫుట్‌పాత్‌ (footpath)ల‌పై జ‌నం న‌డ‌వాలి.. ఇది బేసిక్ థింగ్‌. కానీ మ‌న దేశంలో చాలా వ‌ర‌కూ ఫుట్‌పాత్‌ల‌ను కూడా రోడ్లుగా వాడేస్తున్నారు. జ‌నాల‌కు న‌డిచేందుకు కూడా వీలులేకుండా వాహ‌న‌దారులు ఫుట్‌పాత్‌పై ర‌య్ ర‌య్ మంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా బైక‌ర్‌లు. రోడ్డుపై కొంచెం ట్రాఫిక్ క‌నిపించినా స‌రే వెంట‌నే ఫుట్‌పాత్‌పైకి వాహ‌నాన్ని ఎక్కించేస్తుంటారు.

ఇలాంటి దృష్యాలు మ‌న దేశంలోని చాలా సిటీల్లో క‌నిపిస్తాయి. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఫుట్‌పాత్‌పై వెళ్తున్న వాహ‌నాల‌ను చూస్తూ ఉండిపోతాం కానీ.. అడ్డుకునే ప్ర‌య‌త్నం మాత్రం చేయం. కానీ ఓ బామ్మ (Elderly Woman) మాత్రం అలా అడ్డ‌దిడ్డంగా వెళ్తున్న ఓ వాహ‌న‌దారుడిని న‌డిరోడ్డుపై ఆపి క‌డిగి పారేసింది. ఇదేం ప‌ని.. నీకు అస‌లు సివిల్ సెన్స్ ఉందా..? లేదా..? అంటూ నిల‌దీసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

బైక‌ర్‌ను అడ్డుకున్న బామ్మ‌..

ఓ ఫుట్‌పాత్‌పై వాహ‌నం న‌డిపేందుకు య‌త్నించిన ఓ బైక‌ర్‌ను బామ్మ ధైర్యంగా అడ్డుకుంది. ఇదేంట‌ని రోడ్డుమీదే నిల‌దీసింది. మీరు ఫుట్‌పాత్‌ల‌పై కూడా వాహ‌నాలు న‌డిపితే.. మేం ఎక్క‌డ న‌డ‌వాలి అంటూ ప్ర‌శ్నించింది. ఆ బైక‌ర్‌ను ముందుకు పోనీకుండా అడ్డుకుంది. అత‌డు ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో నంబ‌ర్ ప్లేట్ ఫొటో తీసేందుకు కూడా ప్ర‌య‌త్నించింది. దీంతో చేసేదేమీ లేక స‌ద‌రు వాహ‌న‌దారుడు వెన‌క్కిమ‌ళ్లి త‌న వాహ‌నాన్ని రోడ్డుపైకి మ‌ళ్లించాడు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌ (Kerala)లోని కోజికోడ్‌ (Kozhikode)లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

బామ్మ ధైర్యానికి హ్యాట్సాఫ్‌..

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు బామ్మపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ బామ్మ‌ను చూసైనా మ‌నం నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె లాగా మ‌నం కూడా ఇక నుంచి ఫుట్‌పాత్‌ల‌పై వాహ‌నాల‌ను న‌డిపే వారిని అడ్డుకోవాలంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ బామ్మ చేసిన ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Cold Drinks | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఢిల్లీ స్టేడియంలో తాగి మిగిలిపోయిన‌ కూల్ డ్రింక్స్ మళ్ళీ బాటిళ్లలోకి..! షాకింగ్ వీడియో
Municipal Elections | మున్సిప‌ల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. సాయంత్రానికి తుది ఫ‌లితాలు..!

Latest News