Laptop Offer| రూ.4వేలకే ల్యాప్ టాప్..ఎగబడ్డ జనం

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ సంస్థ రూ.4000కే ల్యాప్‌టాప్ అని బంపర్ సేల్ ప్రకటించడంతో...ఇది తెలుసుకున్న జనం ఎక్కడెక్కడి నుంచే ఆ దుకాణం వద్ద ఎగబడ్డారు.

విధాత, హైదరాబాద్ : వస్తువుల కొనుగోలుపై తక్కువ ధరకు..బంపర్ ఆపర్లకు జనం ఎగబడటం సాధారణంగా మారింది. తాజాగా హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ సంస్థ రూ.4000కే ల్యాప్‌టాప్( Laptop Offer) అని బంపర్ సేల్ ప్రకటించడంతో…ఇది తెలుసుకున్న జనం ఎక్కడెక్కడి నుంచే ఆ దుకాణం వద్ద ఎగబడ్డారు. ఆదివారం ఉదయం నుంచే దుకాణం ముందు క్యూ కట్టారు.

తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు లభిస్తాయనే ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివచ్చారు. రద్దీ గంట గంటకు పెరుగుతూ వెళ్లి దుకాణం ముందు క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. క్యూలైనల్లో నిలబడిన జనం ఊపిరాడని స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొక్కిసలాట వంటి ఘటన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని..నిర్వాహకులు..పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రద్దీని నియంత్రించేందుకు దుకాణాన్ని కొద్దిసేపు మూసివేయించారు.

Latest News