Anaconda Vs Python | అనకొండ, కొండచిలువ మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి? వాటి బలాబలాలేంటి?

కొండచిలువ, అనకొండ ఫైట్‌ చేస్తే ఏది గెలుస్తుంది? దేని శక్తియుక్తులేంటి? ఆసక్తికర సంగతులు

Anaconda Vs Python | అనకొండ, పైథాన్‌! సాధారణంగా ఈ రెండింటి విషయంలో చాలా మంది పొరపడుతూ ఉంటారు. ఈ రెండూ ఒకటేనని అనుకుంటారు. కానీ.. ఈ రెండూ వేర్వేరు సర్ప జాతులు. పైథాన్‌లు.. (కొండచిలువలు) ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అనకొండలు ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. అయితే.. కొన్ని కొత్త ప్రాంతాల్లో బర్మీస్‌ పైథాన్‌లు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండు సర్పాల మధ్య ఫైట్‌ జరిగే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేము. అదే జరిగితే.. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద సర్పజాతులైన అనకొండ, కొండ చిలువ మధ్య ఫైట్‌ జరిగితే గెలిచేదెవరో అంచనా వేశారు ఔత్సాహికులు. పైథాన్‌లు, కొండ చిలువల విషయంలో కొందరు ఒకే జాతిగా కన్‌ఫ్యూజ్‌ అవుతుంటారు. రెండూ బలంగా, పొడవుగా కనిపించడమే అందుకు కారణం. రెండు పాములు విషరహితాలు. అయితే.. తమ ఆహారాన్ని కొరికి, చనిపోయేలా బలంగా చుట్టేసి, ఆ తర్వాత తాపీగా మింగేస్తాయి. ఈ రెండూ ఒకేలా కనిపిస్తున్నా.. నిశితంగా గమనిస్తే వాటి పరిమాణం, బలం, అవి నివసించే ప్రాంతాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి. మరి ఈ రెండూ తారసపడినప్పుడు ఫైట్‌ జరిగితే ఏమవుతుంది? చూద్దాం..!!

పరిమాణము, నిర్మాణం

రెండు పాములూ చాలా పెద్దవి. కానీ రెండింటి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది. పైథాన్‌లు 30 అడుగుల పొడవు వరకూ పెరుగుతాయి. సుమారు 90 కిలోల బరువు తూగుతాయి. అనకొండలు సాధారణంగా కొంత తక్కువ పొడవుతో.. అంటే సుమారు 17 అడుగల నుంచి 22 అడుగుల వరకూ పెరుగుతాయి. ఇవి సుమారుగా 113 కిలోల నుంచి.. 250 కిలోల బరువు వరకూ ఉంటాయి. అనకొండ శరీరం డయామీటర్‌ 12 అంగుళాల వరకూ ఉంటుంది. ఫలితంగా అవి మరింత శక్తిమంతమైనవి.

వేగం.. కదలికలు

సాధారణంగా కొండ చిలువలు చాలా నెమ్మదిగా కదులుతాయి. ఇవి భూమిపై గంటకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం.. అదే నీటిలో అయితే.. మూడున్నర నుంచి 5 కిలోమీటర్లు వెళ్లగలవు. కానీ.. అనకొండలు చాలా వేగంగా కదులుతాయి. చురుకుగా ఉంటాయి. నీటిలో గంటకు 8 నుంచి 16 కిలోమీటర్లు వెళ్లగలవు. నేల మీదకంటే నీటిలో వాటికి అడ్వాంటేజ్‌ ఎక్కువ.

నలిపేసే శక్తి..

రెండు పాములూ తమ ఆహారాన్ని చంపేందుకు వాటిని గట్టిగా బంధిస్తాయి. పైథాన్‌ల గ్రిప్‌ సుమారు 14 పీఎస్‌ఐ (పౌండర్స్‌ పర్‌ స్వ్కేర్‌ ఇంచ్‌) ఉంటుంది. అంటే ఒక సాధారణ జంతువును ఊపిరాడనీయకుండా బిగబట్టి చంపగలదు. అనకొండ గ్రిప్‌ శక్తి.. 90 పీఎస్‌ఐ. పెద్ద పెద్ద జంతువులను సైతం ఇది చుట్టేసి చంపగలదు. వీటికి తోడు రెండు పాములకూ సుమారు వంద వరకూ వెనక్కు తిరిగి ఉన్న కోరలు ఉంటాయి. వాటి కారణంగా తాము కరిచిన ఆహారాన్ని బలంగా పట్టి ఉంచగల శక్తిని కలిగి ఉంటాయి. రెండు పాములు విషరహితమైనప్పటికీ.. అనకొండ కాటు అత్యంత శక్తిమంతమైనది కారణంగా.. ఫైట్‌లో అది అత్యంత ప్రమాదకారిగా ఉంటుంది.

షేక్‌ అవుతున్న ఇంటర్నెట్.. ఈ వీడియో చూసే దమ్ముందా..?

రక్షణ.. ఆఘ్రాణ శక్తి

రెండు పాములూ తమ నాలుకలు, జాకబ్‌సన్స్‌ ఆర్గాన్‌తో చుట్టుపక్కల వాతావరణంలో వాసనలను గ్రహిస్తాయి. వేడిని గుర్తించడానికి, తమ ఆహారాన్ని గుర్తించడానికి కూడా ఇది దోహదం చేస్తుందని a(-)z(-)animals(dot)com పేర్కొంటున్నది. కొండచిలువ కంటి చూపు నాణ్యత చాలా తక్కువ ఉంటుంది. కానీ.. అత్యంత చిన్న శబ్దాలను కూడా వినగలదు. అనకొండలు నీటిలో సైతం వైబ్రేషన్స్‌ను ఫీల్‌ అవ్వగలవు.

వేటాడే స్వభావం..

రెండు పాములూ మాటు వేసి దాడి చేస్తాయి. చాలాసేపు ఎదురుచూసి, తన ఆహారం రాగానే.. ఒక్కసారిగా దాడి చేసి, కాటు వేస్తాయి. వెంటనే తమ శరీరంగా తమ ఆహారాన్ని చుట్టుముట్టేసి, ఊపిరాడకుండా చేస్తాయి. కొండచిలువలు సాధారణంగా భూమిపై వేటాడుతాయి. ఎక్కువగా రాత్రిపూట ఆహారం కోసం అన్వేషిస్తాయి. పందులు, జింకలు వంటి మధ్యస్థాయి జంతువులు ప్రధానంగా వీటి ఆహారం. అనకొండలు భూమిపైనే కాదు.. నీటిలోనూ వేటాడుతాయి. తాము వేటాడిన ఆహారాన్ని నీటిలోకి తీసుకెళ్లి తింటాయి. వాటికి ఉన్న బలం, శక్తి కారణంగా పెద్ద పెద్ద జంతువులను సైతం హతమార్చగలదు.

King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?

వీటి మధ్య ఫైట్‌లో ఏది గెలుస్తుంది?

కొండచిలువ, అనకొండ మధ్య ఫైట్‌ జరిగితే.. అనకొండకే గెలిచే అవకాశాలు ఉంటాయి. పైథాన్‌లు పొడవైనవి, తమ శరీరాన్ని ఎంతగానైనా వంచగలిగినవి అయినప్పటికీ.. అనకొండ శరీర దళసరి తత్వం, దాని కండ బలం ముందు కొండచిలువలు బలహీనమైనవే. అనకొండలతో పోల్చితే ప్రత్యేకించి నీటిలో కొండచిలువలు మరీ బలహీనంగా ఉంటాయి. అనకొండ శక్తి, చుట్టివేసినప్పుడు ప్రయోగించే బలం, ఈదే స్వభావం అది పైచేయి సాధించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సమయంలో కొండచిలువ దాని పట్టు నుంచి విడిపించుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఉండదు. భూమిపైనా అనకొండ పరిమాణం, శక్తి ముందు కొండచిలువ నిలువలేదు.

అవగాహన కోసం మాత్రమే

ఈ విశ్లేషణ అనకొండ, కొండచిలువల శక్తి, వాటి శరీరతత్వం, వాటి అలవాట్లు, ప్రవర్తన పై అవగాహన కల్పించేందుకు మాత్రమే. నిజానికి ఈ రెండూ పోరాడినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. పోరాటం జరిగితే ఏమవుతుందనే అంశంపై ఇది ఊహాత్మకమే.

Read Also

King Cobra, Mongoose Fight | కింగ్ కోబ్రా, తెల్ల తోక ముంగిస మ‌ధ్య ఫైట్‌లో గెలిచేదేంటి?
Viral Video | 19 అడుగుల పైథాన్‌తో యువ‌కుడి యుద్ధం.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..?
King Cobra : మన్యం జిల్లాలో 16 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్
snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?