విధాత: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి ఈ భూమ్మీద ఉండకపోవచ్చు. ఇక ఫోన్ చేతిలో ఉంటే చాలు.. యూట్యూబ్, ట్విట్టర్ ఇన్ స్టా, ఫేస్‌బుక్ ఖాతాలను ఓపెన్ చేసి.. అందులో మునిగిపోతుంటారు. ఆ మాధ్యమాల్లో వచ్చే వీడియోలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.
అప్పుడప్పుడు కొన్ని భయంకరమైన వీడియోలు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. అలాంటి భయంకరమైన వీడియోనే ఇది. ఈ వీడియో చూడాలంటే తప్పకుండా దమ్ముండాలి. గుండె ధైర్యం కూడా ఉండాల్సిందే. అంతటి భయంకరమైన వీడియో ఇది మరి.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఆఫీసర్ సుశాంత నంద సోమవారం ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 32 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో భారీ పైథాన్ మనకు కనిపిస్తుంది. ఆ పైథాన్ మెట్ల పక్కనే ఉండే రెయిలింగ్‌పై మెల్లిమెల్లిగా పైకి పాకుతోంది.
అలా ఒకటో అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి ఆ పైథాన్ వెళ్లిన దృశ్యాలను చూస్తుంటే శరీరంలో వణుకు పుడుతోంది. భారీ పైథాన్‌ను చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. సోమవారం ఉదయం పదిన్నరకు పోస్టు చేయగా.. మధ్యాహ్నానికి 10 వేల మందికిపైగా వీక్షించారు. మరో 400 మందికిపైగా లైక్ చేశారు.