Congress అత్యధికంగా తుంగతుర్తికి 23, సాగర్ కు రెండే విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ చేసేందుకు ఆశావాహులు బహుళ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దరఖాస్తుల వడపోత సాగిస్తుండటంతో టికెట్ సాధనపై దరఖాస్తు దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరికి సంబంధించి 12నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడి స్థానాలకు మొత్తం 130మంది […]
Congress
విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ చేసేందుకు ఆశావాహులు బహుళ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ దరఖాస్తుల వడపోత సాగిస్తుండటంతో టికెట్ సాధనపై దరఖాస్తు దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరికి సంబంధించి 12నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇక్కడి స్థానాలకు మొత్తం 130మంది ఆశావాహులు గాంధీ భవన్ లో అప్లికేషన్లు సమర్పించిన తీరు చూస్తే ఒక్కొక్క స్థానానికి ఎంత పోటీ నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా తుంగతుర్తి(ఎస్సీ రిజర్వ్డ్) స్థానానికి అత్యధికంగా 23మంది కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం పోటీపడితే, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కేవలం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కొడుకులు ఇద్దరే పోటీ పడడం విశేషం.
ఇక మిర్యాలగూడ 20 మంది, నకిరేకల్(ఎస్సీ) 18, ఆలేరు 17, భువనగిరి 11, దేవరకొండ(ఎస్టీ) 10, నల్గొండ 7,హుజుర్ నగర్లో 7, సూర్యాపేట 6, కోదాడ 5, మునుగోడు 4 మంది చొప్పున దరఖాస్తులు చేసుకున్నారు.
ఎస్సీ రిజర్వుడు స్థానాలకే ఎక్కువ
ఎస్సీ రిజర్వుడు స్థానాలైన తుంగతుర్తి, నకిరేకల్ కు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఆశావాహులు దరఖాస్తులు సమర్పించడంతో ఆయా స్థానాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక కాంగ్రెస్ దిగ్గజాలుగా చెప్పుకొనే ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్లికేషన్ చేసిన నల్గొండకు కూడా ఏడుగురు దరఖాస్తు చేసుకోగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానమైన హుజుర్ నగర్ నుంచి కూడా మరో ఏడుగురు దరఖాస్తు సమర్పించారు.
టికెట్ అదృష్టం ఎవరిని వరించేనో..
టికెట్ల కోసం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకోవడంతో అదృష్టం ఎవరిని వరిస్తుందో వారి అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రూట్నీ మొదలుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్లు కేటాయిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను 90 శాతం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ కూడా సెప్టెంబర్ రెండో వారంలోనైనా సగం మంది అభ్యర్థులను ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల వారిగా దరఖాస్తుదారుల వివరాలు
నల్గొండ నియోజకవర్గంలో
1. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
2. దుబ్బాక నరసింహ రెడ్డి
3. డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్
4. డాక్టర్ మల్లేబోయిన ఆంజనేయులు
5. తండు సైదులు గౌడ్
6. నూనె కోటి
7. వనమాల రమేష్ నేత
నకిరేకల్(ఎస్సీ) నియోజకవర్గంలో
1. కొండేటి మల్లయ్య
2. దైద రవీందర్
3. సలగాటి ప్రసన్న రాజ్
4. పెరిక వెంకటేశ్వర్లు
5. శికిలం అరుణ్ కుమార్
6. దైద స్వప్న
7. పోకల దేవదాస్
8. వంగూరి లక్ష్మయ్య
9. నకిరేకంటి వెంకటేశ్వర్లు
10. వేదాసు వెంకయ్య
11. వేదాసు శ్రీధర్
12. ఏర్పుల యాదగిరి
13. దోసపాటి విజయ్ కిషోర్
14. పెరుమాళ్ళ శేఖర్
15. అనుముల పూరి వెంకట శివ రాజీవ్
16. మేడి రవిచంద్ర
17. తక్కెళ్ళ జంగయ్య
18. నేతకాని కృష్ణయ్య
మునుగోడు నియోజకవర్గంలో
1. పాల్వాయి స్రవంతి
2. చల్లమల్ల కృష్ణారెడ్డి
3. డాక్టర్ బైకని లింగం యాదవ్
4. పున్న కైలాష్ నేత
మిర్యాలగూడ నియోజకవర్గంలో
1. కుందూరు రఘువీర్ రెడ్డి
2. పగిడి రామలింగయ్య యాదవ్
3. ముదిరెడ్డి నర్సిరెడ్డి
4. బత్తుల లక్ష్మారెడ్డి
5. అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి
6. చిరుమర్రి కృష్ణయ్య
7. గోపగాని మాధవి
8. జటంగి వెంకట నరసయ్య
9. చిలుకూరి బాలకృష్ణ
10. గుండు నరేందర్ గౌడ్
11. కుర్ర నాగు నాయక్
12. కేతావత్ శంకర్ నాయక్
13. కర్నాటి నాగేంద్రప్రసాద్
14. ముత్తినేని వీరయ్య
15. చల్ల తేజ వీర వెంకట సత్యనారాయణ
16. నూకల వేణుగోపాల్ రెడ్డి
17. పుట్టల కృష్ణయ్య
18. తమ్మడబోయిన అర్జున్
19. బెజ్జం సైదులు
20. ఎండి జానీ పాషా
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో
1. కుందూరు రఘువీర్ రెడ్డి
2. కుందూరు జైవీర్ రెడ్డి
దేవరకొండ(ఎస్టీ) నియోజకవర్గంలో
1. నేనావత్ బాలు నాయక్
2. నేనావత్ కిషన్ నాయక్
3. రవి నాయక్
4. వడ్త్యా రమేష్ నాయక్
5. నేనావత్ ప్రవళిక నాయక్
6. రమావత్ జగన్ లాల్ నాయక్
7. శ్రీరాముల జ్ఞానేశ్వర్
8. ఆంగోతు ప్రవీణ్ నాయక్
9. కేతావత్ బిలియా నాయక్
10. మూడవత్ రేఖ నాయక్
సూర్యాపేట నియోజకవర్గంలో
1. రాంరెడ్డి దామోదర్ రెడ్డి
2. పటేల్ రమేష్ రెడ్డి
3. తండు శ్రీనివాస్ యాదవ్
4. ముషం రవికుమార్
5. ఎలగందుల రాము
6. కుంట్ల మంజులా రెడ్డి
తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గంలో
1. అద్దంకి దయాకర్
2. ఎన్ ప్రీతం
3. పిడమర్తి రవి
4. అన్నపర్తి జ్ఞాన సుందర్
5. వడ్డేపల్లి రవి
6. బాషపొంగు భాస్కర్
7. యుగేందర్
8. వల్లమల్ల జయాకర్
9. పడిదల రవికుమార్
10. మమత నాగిరెడ్డి
11. ఇటికల చిరంజీవి
12. సూరారపు కృష్ణవేణి
13. నంది శ్రీహరి
14. గుడిపాటి నరసయ్య
15. గుండాల మురళీధర్
16. కందుకూరి అంబేద్కర్
17. అనుముల పూరి రవిబాబు
18. కరుణాసాగర్
19. పంతం నరసయ్య
20. మహేశ్వర్
21. రేణుక నాగమల్లు
22. చింతమల్ల రమేష్
23. దోసపాటి విజయ కిషోర్
హుజూర్ నగర్ నియోజకవర్గంలో
1. ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి
2. నాగార్జున విద్యాసాగర్ చారి
3. సామల శివారెడ్డి
4. పిల్లుట్ల రఘు
5. అన్నపురెడ్డి అప్పిరెడ్డి
6. అల్లం ప్రభాకర్ రెడ్డి
7. జైపాల్ రెడ్డి
కోదాడ నియోజకవర్గంలో
1. నలమాద పద్మావతి రెడ్డి
2. పందిరి నాగిరెడ్డి
3. సామల జైపాల్ రెడ్డి
4. అన్నపురెడ్డి అప్పిరెడ్డి
5. వెంకటేశ్వర్లు
భువనగిరి నియోజకవర్గంలో
1. చెవిటి వెంకన్న యాదవ్
2. పోత్నాక్ ప్రమోద్ కుమార్
3. తంగళ్ళపల్లి రవికుమార్
4. పున్న రామలింగం
5. వాకిటి అనంతరెడ్డి
6. బర్రె జహంగీర్
7. పంకల రామాంజనేయులు గౌడ్
8. కసిరెడ్డి నారాయణరెడ్డి
9. శశిధర్ రావు
10.పి. శివరాజ్ గౌడ్
11. పాక మల్లేష్ యాదవ్
ఆలేరు నియోజకవర్గంలో
1. బీర్ల ఐలయ్య యాదవ్
2. బండ్రు శోభారాణి
3. బోరెడ్డి అయోధ్య రెడ్డి
4. జనగాం ఉపేందర్ రెడ్డి
5. డాక్టర్ కె. నగేష్
6. కల్లూరి రామచంద్రారెడ్డి
7. పంతం వీరారెడ్డి
8. డి. శంకర్ నాయక్
9. వెంకటేశ్వర రాజు
10. గంధమల్ల అశోక్
11. కానుగు బాలరాజు
12. కొంతం మోహన్ రెడ్డి
13. మధుసూదన్ రెడ్డి
14. గుడిపాటి మధుసూదన్ రెడ్డి
15. అండం సంజీవరెడ్డి
16. నీలం పద్మ
17. ఎల్లంల సంజీవరెడ్డి.