Site icon vidhaatha

snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?

snakes take revenge: పాములకు సంబంధించిన అనేక విషయాలు ప్రచారంలో ఉంటాయి. పాములను దేవతా స్వరూపాలుగా కూడా కొలుస్తుంటారు. అయితే పాములు పగబడతాయాని చాలా మంది ప్రజలు నమ్ముతారు. పాములు నాదస్వరానికి అనుకూలంగా నాట్యం చేస్తాయని కూడా నమ్ముతూ ఉంటారు. అనేక సినిమాల్లోనూ మనకు దీన్ని చూపిస్తారు. అయితే పాములు నిజంగానే పగబడతాయా.. దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా.. అన్న విష‌యం ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

పాముకు పగ ఉంటుందా?

పాముకు పగ అనేది ఏమీ ఉండదని శాస్త్రీయంగా రుజువు అయ్యింది. అందుకు కారణం పాములకు భావోద్వేగాలను నియంత్రించుకొనే భాగాలు ఏవీ అభివృద్ధి చెందలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాములకు మనుషులు, లేదా ఇతర జంతువులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు అవి కేవలం ప్రాణరక్షణ కోసం మాత్రమే కాటు వేస్తాయి తప్ప.. కావాలని ఒక మనిషి కోసం వేచి చూడటం.. అతడు కనిపించినప్పుడు కాటు వేయడం జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి ప్రతీకార భావం ఉంటే అవకాశమే లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

సంగీతానికి పాములు డ్యాన్స్ చేస్తాయా..

కొన్ని రకాల వాయిద్యాలను పాము ముందు వాయించినప్పుడు వాటి శబ్ధానికి అనుగుణంగా అవి కదులుతున్నట్టు మనం అనేక సినిమాల్లోనూ ప్రత్యక్షంగానూ చూస్తూ ఉంటాము. అయితే పాములకు వినికిడి శక్తి చాలా తక్కువ. అవి కేవలం భూమి కంపనాల ఆధారంగానే శబ్ధాలను గ్రహిస్తాయి. నాదస్వరం విని పాములు నాట్యం చేయడం జరగదని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. నాదస్వరం ఊదే వ్యక్తి కదలికలను గమనించి మాత్రమే పాములు కదులుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. పాము విషం అత్యంత ప్రమాదం కాబట్టి.. ఉద్దేశ్యపూర్వకంగా పాము దగ్గరకు వెళ్లడం.. దాన్ని కొట్టడం లాంటివి చేయొద్దు.. ఇది ప్రమాదకరం. పాము కాటుకు గురైతే వెంటనే వైద్య సహాయం పొందండి.

 

Exit mobile version