Site icon vidhaatha

జనాభా లెక్కలను విడుదల చేసిన కేంద్రం.. ఏపీలో జననాల్లో కర్నూలు టాప్..

★ 2019లో దేశంలో జనన, మరణాలకు సంబంధించిన తాజా జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లు. 2019లో 2.67 కోట్ల జననాలు నమోదు కాగా, 83 లక్షల మంది చనిపోయారు. నిమిషానికి సగటున 51 మంది శిశువులు జన్మిస్తుంటే, 16 మంది కన్నుమూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లుగా, తెలంగాణ జనాభా 3.72 కోట్లుగా నివేదిక పేర్కొంది. లింగ నిష్పత్తిలో ఏపీ 16వ స్థానంలో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో ఉంది.

★ ఆంధ్రప్రదేశ్‌లో జననాల్లో కర్నూలు ముందుండగా, మరణాల్లో తూర్పుగోదావరి జిల్లా ముందున్నాయి. 2019లో ఏపీలో 7,54,939 మంది జన్మించారు. 4,01,472 మంది మరణించారు. మరణించిన వారితో పోలిస్తే జన్మించిన వారి సంఖ్య 88 శాతం అధికం. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం 2019 మధ్య నాటికి ఏపీ మొత్తం జనాభా 5,23,15,000.

Exit mobile version