Site icon vidhaatha

నెమ్మ‌దిగా త‌గ్గుతున్న‌ క్రియాశీల రేటు

విధాత‌: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అదుపులోకి వచ్చినట్లే కన్పిస్తోంది. క్రియాశీల రేటు తగ్గడం.. రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. యాక్టివ్‌ కేసుల రేటు 1శాతం దిగువకు పడిపోయింది. అటు కొత్త కేసులు కూడా భారీగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50శాతం ఎక్కువగా ఉంది.

దేశంలో కొత్తగా 25,467 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 39,486 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.17కోట్ల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 97.68శాతానికి పెరిగింది.కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్‌ కేసులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,551 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.98శాతంగా ఉంది.

గడిచిన 24 గంటల్లో మరో 354 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 4,35,110 మందిని కరోనా బలితీసుకుంది.ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. సోమవారం 63,85,298మంది టీకాలు వేశారు. ఇప్పటివరకు 58.89కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Exit mobile version