Site icon vidhaatha

దేశంలో క్ర‌మంగా త‌గ్గుతున్న క‌రోనా కేసులు

విధాత‌: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం ప‌డుతున్నాయి. కొన్ని రోజులుగా కొత్త కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో 7వేల దిగువనే నమోదవుతున్నాయి. ఇక క్రియాశీల కేసుల క్ర‌మంగా త‌గ్గుతూ 50 వేలకు దిగిరావడం సానుకూలాంశం. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 3,25,602 నిర్ధారణ పరీక్షలు చేయ‌గా.. కొత్తగా 6,395 కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతానికి చేరింది. నిన్న 6,614 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.39 కోట్లు (98.70 శాతం) దాటింది.
యాక్టివ్‌ కేసులు క్రమంగా తగ్గుతూ 50,342(0.11 శాతం) కు క్షీణించాయి.

దేశంలో వ్యాక్సినేషన్‌ ద్వారా ఇప్పటివరకు 214.27 కోట్ల డోసులను పంపిణీ చేయగా.. నిన్న 36,31,977 టీకాలు వేసిన‌ట్టు కేంద్రం తెలిపింది.

Exit mobile version